Thursday, 13 October 2016

శుభవార్త చెబుతానంటున్న యంగ్ హీరో!

హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు కలిసొచ్చిన ప్రయోగాలనే ఎంపికచేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు వీఐ ఆనంద్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అన్న సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, తాజాగా మరో కొత్త సినిమాను కూడా అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ‘స్వామిరారా’తో నిఖిల్‌ కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చి దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ నిఖిల్ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.
“స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మతో షూటింగ్ చేస్తూ ఉండడం ఒక సంతోషకరమైన విషయం అయితే, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త కూడా ప్రకటించే అవకాశం రావడం మరింత సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన వార్తను త్వరలోనే ప్రకటిస్తా” అంటూ నిఖిల్ తెలిపారు. నవంబర్ 11న విడుదల కానున్న ఈ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించి నిఖిల్ చెప్పబోయే ఆ శుభవార్త సినిమా బిజినెస్ విషయమై ఉంటుందని వినిపిస్తోంది.

Tuesday, 11 October 2016

‘ప్రేమమ్’కు త్రివిక్రమ్ ముద్ర కూడా.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దర్శకుడు అంతకుమించి మంచి రచయిత

‘ప్రేమమ్’ సినిమా విషయంలో జరిగిన నెగెటివ్ పబ్లిసిటీ చాలా బాధపెట్టిందని అంటున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అలాంటి టైంలో అక్కినేని నాగార్జున.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ల ఫీడ్ బ్యాక్ తమలో ఆత్మవిశ్వాసం నింపిందని చందూ చెప్పాడు. చైతూకు తండ్రి కాబట్టి ఆటోమేటిగ్గా ‘ప్రేమమ్’ చూసి ఉంటాడు. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటాడు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయనకు అత్యంత ఆప్తుడైన ఎస్.రాధాకృష్ణకు చెందిన ‘హారిక హాసిని క్రియేషన్స్’ బేనర్ నుంచి వచ్చిన మరో బ్రాంచే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అన్నమాట. ముందు ‘బాబు బంగారం’తో ఎంట్రీ ఇచ్చిన ఈ బేనర్.. రెండో సినిమాగా ‘ప్రేమమ్’ను తెరకెక్కించింది.

Monday, 10 October 2016

‘ప్రేమమ్’కు త్రివిక్రమ్ ముద్ర కూడా.

‘ప్రేమమ్’ సినిమా విషయంలో జరిగిన నెగెటివ్ పబ్లిసిటీ చాలా బాధపెట్టిందని అంటున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అలాంటి టైంలో అక్కినేని నాగార్జున.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ల ఫీడ్ బ్యాక్ తమలో ఆత్మవిశ్వాసం నింపిందని చందూ చెప్పాడు. చైతూకు తండ్రి కాబట్టి ఆటోమేటిగ్గా ‘ప్రేమమ్’ చూసి ఉంటాడు. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటాడు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయనకు అత్యంత ఆప్తుడైన ఎస్.రాధాకృష్ణకు చెందిన ‘హారిక హాసిని క్రియేషన్స్’ బేనర్ నుంచి వచ్చిన మరో బ్రాంచే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అన్నమాట. ముందు ‘బాబు బంగారం’తో ఎంట్రీ ఇచ్చిన ఈ బేనర్.. రెండో సినిమాగా ‘ప్రేమమ్’ను తెరకెక్కించింది.

ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ‘ప్రేమమ్’ సినిమా రఫ్ కట్ చూశాడట. సినిమా చాలా బాగుందని.. మంచి విజయం సాధిస్తుందని భరోసా ఇచ్చాడట మాటల మాంత్రికుడు. సినిమాలో చిన్న చిన్న మార్పులు చెప్పడంతో పాటు ఒక చిన్న డైలాగ్ కూడా త్రివిక్రమ్ సజెస్ట్ చేశాడని చందూ చెప్పాడు. ‘ప్రేమమ్’ గురించి సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగినపుడు సినిమా మీద కొంచెం సందేహాలు కలిగాయని.. ఆ టైంలో నాగార్జునతో పాటు త్రివిక్రమ్ కూడా సినిమా మీద పాజిటివ్‌గా స్పందించడంతో తమకు మళ్లీ నమ్మకం కుదిరిందని చందూ చెప్పాడు. తన కెరీర్ మొత్తానికి సరిపడా స్ట్రెస్.. ఒక్క ‘ప్రేమమ్’కే అనుభవించానని.. చివరికి సినిమా హిట్టవడంతో ఇప్పుడు చాలా రిలాక్స్డ్‌‌గా అనిపిస్తోందని చందూ అన్నాడు

కంచె తీశాడు.. శాతకర్ణి తీయలేడా?

ముందుగా ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం.. టైట్ షెడ్యూల్స్ వేసుకుని రంగంలోకి దిగడం.. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఇక ఉరుకులు పరుగుల మీద పని చేయడం.. సినిమాను ఆన్ టైం రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడటం.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఇలాంటి వ్యవహారాలు మామూలైపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ గత మూడు సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు కూడా ఇలాగే హడావుడి పడ్డారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ ఇలాగే జరుగుతోందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీతనంతో కూడుకున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని హడావుడిగా చుట్టేస్తున్నారంటూ ఇండస్ట్రీలో రూమర్లు బయల్దేరాయి.

తమిళనాడులో..32ఏళ్ల క్రితం ఇలాగే జరిగింది..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు వారాలకు పైగా హాస్పిటల్‌కే పరిమితమయ్యారు. ఆమె పాలించే స్థితిలో లేరన్న హింట్ ఇస్తూ విపక్షం తాత్కాలిక ముఖ్యమంత్రి నియామకానికి పట్టుపడుతోంది. అధికార పార్టీ మాత్రం ఆ అవసరం లేదని వాదిస్తోంది. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో 32ఏళ్ల క్రితం నాటి ఉదంతమే అందరికీ గుర్తుకొస్తోంది. అప్పుడూ ఇప్పుడూ ముఖ్యమంత్రుల తీరు, రాజకీయ పరిణామాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అది 1984 అక్టోబర్ 5. రాత్రి పూట.. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఊపిరి తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. భార్య జానకి, వ్యక్తిగత వైద్యుడు ఆయనను చెన్నై శివార్లలోని తమ నివాసం రామవరం గార్డెన్స్‌ నుంచి నగరంలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్ ప్రారంభమై అప్పటికి ఏడాది మాత్రమే. హాస్పిటల్‌కు వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికే అక్కడ ఉంటానని ఎంజీఆర్ భావించారు. అందుకే తన అనారోగ్య వార్తను మీడియాకు వెల్లడించవద్దని సూచించి తనతో పాటే వచ్చిన భద్రతా సిబ్బందితో పాటూ తన కార్‌నూ ఆసుపత్రి నుంచి పంపేశారు.

కొన్ని గంటల్లోనే అంతా బాగైపోతుందనుకున్న ఎంజీఆర్ మంచం పట్టారు. దీంతో అపోలో ఆసుపత్రి రాజకీయ కేంద్రమైపోయింది. రాష్ట్ర, జాతీయ నేతలు ఎంక్వైరీలు చేయడంతో పాటూ ఆయనను పరామర్శించేందుకు క్యూ కట్టారు. అప్పటి ఆరోగ్య మంత్రి హెచ్.వి. హాండే ఎప్పటికప్పుడు సీఎం ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించేవారు. ఎంజీఆర్ స్పృహలో ఉన్న కొద్ది రోజులు హాస్పిటల్‌ నుంచే విధులు నిర్వర్తించారు. అయితే అక్టోబర్ 13 నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. స్ట్రోక్ రావడంతో శరీరం కుడిభాగం బాగా ప్రభావితమైంది. మాటలోనూ తేడా వచ్చేసింది. సీటీ స్కాన్ ద్వారా ఆయన మెదడులో టెన్నిస్ బాల్ పరిమాణంలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి పక్షవాతానికి గురి కావడంతో ఆయన వారసుడిపై మల్లగుల్లాలు ప్రారంభమయ్యాయి. ఈ ఇష్యూను డీల్ చేయడం గవర్నర్‌గా ఉన్న ఎస్.ఎల్.ఖురానాకు సవాలుగా పరిణమించింది.

ప్రభుత్వంలో నంబర్‌ టు గా ప్రసిద్ధి గాంచిన అప్పటి ఆర్ధిక మంత్రి వీ.ఆర్ నెదుంచెళియన్ స్ట్రోక్ వచ్చిన ముందు రోజే ఎంజీఆర్‌ను కలిసారు. రాష్ట్ర పగ్గాలు చేపట్టాల్సిందిగా సీఎం తనకు సూచించారని ఆయన గవర్నర్‌కు వివరించారు. అయితే అదే రోజు ఖురానా కూడా ఎంజీఆర్‌ను కలిసారు. కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. కొద్ది రోజుల్లోనే చికిత్స నిమిత్తం ఎంజీఆర్‌ను అమెరికాలోని బ్రూక్లిన్ హాస్పిటల్‌కు  తరలించారు. ఆ తర్వాత, సర్కార్ బాధ్యత తీసుకోవాలంటూ నెదుంచెళియన్‌కు ఎంజీఆర్‌ చెప్పారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటూ సీఎం ప్రైవేట్ సెక్రటరీ కూడా ఖురానాకు లేఖలు రాశారు. దీంతో అక్టోబర్ 25న గవర్నర్ నెదుంచెళియన్‌ను ఆపద్ధర్మ సీఎంగా నియమించారు. నెదుంచెళియన్‌ ఆధ్వర్యంలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యస్థ ఎన్నికలకూ ఆయన సిద్ధపడ్డారు. మూడు నెలల తర్వాత, అమెరికా నుంచి ఆరోగ్యంగా (పక్షవాతం కారణంగా మారిపోయిన ఆయన మాట అలాగే ఉండిపోయింది) తిరిగివచ్చిన ఎంజీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేశారు. ప్రస్తుతం తమిళనాడులోనూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నియామకంపై చర్చలు సాగుతున్నాయి. జయలలిత విధేయుడు పన్నీర్ సెల్వం పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, పురచ్చి తలైవి కూడా నాటి తలైవాలా కోలుకుని రాష్ట్రాన్ని నడిపించాలని ఆమె అభిమానులు 

Saturday, 8 October 2016

Ae Dil Hai Mushkil I Official Lyric Video I Karan Johar | Aishwarya, Ranbir, Anushka | Pritam


Image result for ae dil hai mushkil


Sing  along  with the official lyric video of Ae Dil Hai Mushkil – The song that is wining hearts and spreading love the world over. The movie  features Ranbir Kapoor, Aishwarya Rai Bachchan and Anushka Sharma. 
Film written & directed by Karan Johar
Movie releases on 28th October, 2016.
Hear it First on Saavn!

Music- Pritam
Lyrics- Amitabh Bhattacharya
Singer- Arijit Singh
Sound Design- Dj Phukan, Sunny M.R.
Music Programmers- Prasad Sashte, Sunny M.R. , Dj Phukan
Mix- Sunny M.R. & Shadab Rayeen
Master- Shadab Rayeen@Newedge
Assistant - Abhishek Sortey
Recording Engineer's- Ashwin Kulkarni, Himanshu Shirlekar, Kaushik Das, Lee Slater

Musicians
Violin I- Rolf Wilson, Morvin Bryce, Natalie Klauda, Ian Humphries, Raja Halder, Jan Regulski
Violin II- Charles Sewart, Michelle Fleming, Debbie Widdup, Kate Robinson
Viola- Meghan Cassidy, Timothy Grant, Eoin Schmidt Martin
Cello- Ashok Klauda, Will Scholfield, Peter Gregson
Oboe/Cor Anglais- Alison Teale
Trumpet- Neil Brough 
String Orchestra recording produced by Nikhil Paul George

Post number one welcome to site



Gautami putra satha karni:

Resize JPG, BMP, GIF and PNG images online, selecting the new image's size and quality. 
This way you will get lighter images, easier to upload to websites, send by e-mail or share with friends.