Thursday, 13 October 2016

శుభవార్త చెబుతానంటున్న యంగ్ హీరో!

హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తనకు కలిసొచ్చిన ప్రయోగాలనే ఎంపికచేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు వీఐ ఆనంద్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అన్న సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, తాజాగా మరో కొత్త సినిమాను కూడా అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ‘స్వామిరారా’తో నిఖిల్‌ కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చి దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ నిఖిల్ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.
“స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మతో షూటింగ్ చేస్తూ ఉండడం ఒక సంతోషకరమైన విషయం అయితే, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త కూడా ప్రకటించే అవకాశం రావడం మరింత సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన వార్తను త్వరలోనే ప్రకటిస్తా” అంటూ నిఖిల్ తెలిపారు. నవంబర్ 11న విడుదల కానున్న ఈ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’కు సంబంధించి నిఖిల్ చెప్పబోయే ఆ శుభవార్త సినిమా బిజినెస్ విషయమై ఉంటుందని వినిపిస్తోంది.

Tuesday, 11 October 2016

‘ప్రేమమ్’కు త్రివిక్రమ్ ముద్ర కూడా.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దర్శకుడు అంతకుమించి మంచి రచయిత

‘ప్రేమమ్’ సినిమా విషయంలో జరిగిన నెగెటివ్ పబ్లిసిటీ చాలా బాధపెట్టిందని అంటున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అలాంటి టైంలో అక్కినేని నాగార్జున.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ల ఫీడ్ బ్యాక్ తమలో ఆత్మవిశ్వాసం నింపిందని చందూ చెప్పాడు. చైతూకు తండ్రి కాబట్టి ఆటోమేటిగ్గా ‘ప్రేమమ్’ చూసి ఉంటాడు. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటాడు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయనకు అత్యంత ఆప్తుడైన ఎస్.రాధాకృష్ణకు చెందిన ‘హారిక హాసిని క్రియేషన్స్’ బేనర్ నుంచి వచ్చిన మరో బ్రాంచే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అన్నమాట. ముందు ‘బాబు బంగారం’తో ఎంట్రీ ఇచ్చిన ఈ బేనర్.. రెండో సినిమాగా ‘ప్రేమమ్’ను తెరకెక్కించింది.